ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బీ గిడ్డయ్య కోరారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న ఎన్డీఏ కూటమి బిజేపి , టిడిపి , జనసేనతో పాటు పరోక్షంగా బిజేపికు మద్దతు ఇస్తున్న వైసిపిను ఓడించాలని పిలుపునిచ్చారు. దేశంలో బిజేపి మత రాజకీయాలు చేస్తు బిజేపికు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతిపక్షాల నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేస్తుందని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పించి 100 రోజులలో నిత్యావసర ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీను మరిచారని ఆరోపించారు. టిడిపి , బిజేపి , జనసేన, వైసిపిలను రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని కోరారు.
సమావేశంలో సీపీఐ నాయకులు రంగన్న, భాస్కర్ యాదవ్, తిమ్మగురుడు, మల్లికార్జున గౌడ్,నరసింహులు, ఉరకకుంద పాల్గొన్నారు.