Saturday, April 5, 2025
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: లోకేష్ పై కాదు BVGRపై గెలవండి

Emmiganuru: లోకేష్ పై కాదు BVGRపై గెలవండి

టిడిపి నారా లోకేష్ ను ఎమ్మిగనూరు నుండి నాపై పోటీ చేసి గెలిస్తే రాజకీయాలు నుంచి తప్పుకుంటానని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సవాలు చేయడం మంచిదే కానీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డిపై గెలవాలని ఎమ్మిగనూరు పట్టణ టిడిపి కార్యదర్శి బందే నవాజ్ అన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు ఎర్రకోట కుటుంబాన్ని ఎప్పుడో తిరస్కరించారని రాబోయే 2024 ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో లోకేష్ మీద గెలిచే సత్తా ఏ ఎమ్మెల్యేకు లేదు. 2024లో జయ నాగేశ్వర్ రెడ్డి పైగెలిచి చూపించాలన్నారు. చాలాకాలంగా బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఓ చిన్న కోరిక ఉందని, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మీద గెలవాలని అందుకే ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఎలాగైనా మీ జగనన్నకు అడుక్కొని టికెట్ తెచ్చుకోవాలని సూచించారు. ఎందుకంటే మా బి.వి కోరికను మీరు ఎలాగోలా తీర్చాలన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు టికెట్ లేదని మీ జగనన్న మీకు చెప్పిన సంగతి ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఇకపోతే అవినీతి గురించి మీరు మాట్లాడుతుంటే దెయ్యాలకి వేదాలు వల్లించినట్టుందన్నారు. ఏది ఏమైనా రాబోయే 2024 ఎలక్షన్లో ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబును, ఎమ్మెల్యేగా బివి జయ నాగేశ్వర్ రెడ్డి కోరిక కూడా తీర్చాలని ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News