Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: ఎమ్మిగనూరును చుట్టి ముట్టిన వరద నీరు

Emmiganuru: ఎమ్మిగనూరును చుట్టి ముట్టిన వరద నీరు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుతో పాటు గోనెగండ్ల, నందవరం మండలాలలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున 2.40 గంటలకు ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక వైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు మరోవైపు మెరుపు స్థాయిలో వర్షం. వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులు రైతన్నల తో పాటు వ్యాపారులను కంటతడి పెట్టిస్తున్నాయి. పట్టణంలోని అర్టిసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న స్టైల్ జోన్ బట్టల దుకాణం నీట మునిగి బట్టలు పాడై పోయాయి. మూగతి పేటలో చేనేత కార్మికుడి ఇల్లు కూలిపోయింది. ప్రధాన వంకలు వాగులు, కాలువలు వరద నీటితో ఉదృతంగా ప్రవహించాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట నీటిపాలైంది. వేల రూపాయలు పెట్టుబడి వర్షార్పణమైంది. ఎన్నడూ లేని విధంగా అతి భారీ శబ్ధంతో ఉరుములు, మెరుపులతో కుంభవృష్టి కురిసింది. దీంతో 11 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటన్నర సేపు కురిసిన భారీ వర్షానికి ప్రజలు ఇంట్లో ఉండి ఉరుములు, మెరుపుల శబ్ధానికి భయాందోళనకు గురయ్యారు. మెరుపు ఉరుములు ఎక్కడ పడతాయోనని బిక్కుబిక్కుమంటూ గడిపారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గుడికల్ చెరువు పొంగి పొర్లడంతో పొలాల్లోకి నీరు చేరింది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో విత్తనాలు తడిసిముద్దయ్యాయి. భారీ వర్షం తాకిడికి పట్టణంలో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లన్నీ జలమయ్యాయి. డ్రైనేజీలు నిండి వ్యాపార దుకాణాలు, ఇళ్లలోకి నీరు చేరాయి. మోటార్ల సాయంతో నీటిని బయటికి పంపించారు.

- Advertisement -

శిల్పా ఎస్టేట్ వెనక వైపు ఉన్న సాయినగర్ తో పాటు అయ్యప్ప స్వామి దేవాలయం వెనక ఉన్న కాలని , రిలయెన్స్ పెట్రోల్ బంక్, మునెప్ప నగర్, ధోభి ఘాట్, శివన్ననగర్, మాలగేరి, మూగతి పేట, శివన్న నగర్,మైనారిటీ కాలని, రాధాకృష్ణ కాలని, సోలార్ పంప్ హౌస్, బుడగ జంగాల కాలనీ,రాఘవేంద్ర కాలని, తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటి తో ఇబ్బందులు పడుతున్న ప్రజల వద్ద కు వైసిపి నేత ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, మున్సిపల్ కమిషనర్, గంగిరెడ్డి ,తహసీల్దార్ జయన్న , వ్యవసాయ అధికారులు వెళ్లి ప్రత్యామ్నాయ పరిష్కారాలు చూపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News