Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: అక్రమ లే అవుట్లపై కొరడా

Emmiganuru: అక్రమ లే అవుట్లపై కొరడా

ఎమ్మిగనూరులో అక్రమ వెంచర్లలో రాళ్ళు తొలగింపు

ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా వేసిన వెంచర్లపై కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( కూడా) అధికారులు కొరడా జుళిపించారు. గురువారం కూడా వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డితో కూడా అధికారులు ఎమ్మిగనూరుకు వచ్చారు. గుడికల్, కలగట్ల పంచాయితీ పరిధిలో అక్రమ లే అవుట్లలో వేసిన రోడ్లు ధ్వంసం చేశారు. అలాగే హద్దు రాళ్ళు, కాంపౌండ్ వాల్ కు ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మేళను ప్రొక్కెన్ తో కూలగొట్టారు. గుడికల్ రోడ్డులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హరుణ్, కౌన్సిలర్ నీలకంఠ, ప్రసాద్ వేసిన అక్రమ వెంచర్స్, కలగట్ల రోడ్డులో ప్రభాకర్ రెడ్డి వారి మిత్రులు వేసిన వెంచర్లలో చర్యలు చేపట్టారు.

- Advertisement -

ప్లాట్లకు పాతిన హద్దు రాళ్ళను తొలగించి రోడ్ల మధ్యలో గుంతలు తీశారు. వెంచర్స్ కు చుట్టూ కాంపౌండ్ సరిహద్దు సిమెంట్ దిమ్మెలను తొలగించారు. కూడా వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డితో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి మాట్లాడారు. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మీరు అక్రమంగా వేసిన వెంచర్స్ కు అనుమతులు తీసుకోవాలని ఏడాది క్రితం నోటీసులు ఇచ్చా, ఇంత వరకు సమాధానం ఇవ్వలేదన్నారు. అందుకే చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. దీంతో ఎట్టకేలకు స్పందించిన రియాల్టర్లు మరో మూడు రోజులలో సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించి అనుమతులు తీసుకుంటామని చెప్పారు. ఇదిఇలా ఉండగా అక్రమ లే అవుట్ల లలో ప్లాట్లు కొనుగోలు చేసిన లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News