Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్వైసీపీలోకి పార్లపల్లి టీడీపీ నాయకులు

వైసీపీలోకి పార్లపల్లి టీడీపీ నాయకులు

జగన్ సంక్షేమ పథకాలతో ఆకర్షితులై..

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి సాదిస్తున్నారని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సమక్షంలో పార్లపల్లి వైసీపీ నాయకులు న్యాయవాది జయన్న, మాజీ సర్పంచ్ నారాయణ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మండల పరిధిలోని పార్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ చెందిన సుమారు 200 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరారు. చేరిన వారిలో అబ్రహం న్యాయవాది దావీదు, ఎం. శేఖర్, ఏసన్న, అనందు, ఏసురాజు, ప్రసాద్, రవి, నాగార్జున, చిన్న బతకన్న బడేసాబ్, జయన్న, చంద్రశేఖర్,శ్యామ్ సన్,తప్పటె గిడ్డయ్య, సురేష్, దేవదానమ్, మత్తయ్య తదితరులు ఉన్నారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ పథకాలతో ఆకర్షణ కావడంతో టీడీపీ కి మనుగడ లేకపోయింది. ప్రజలు వైఎస్సార్సీపీ అభిమానిస్తున్నారు. పార్టీ లో చేరిన వారికి తగిన గుర్తింపు నిస్తమని, వైఎస్సార్సీపీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News