Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: జర్నలిస్టుల సమస్యలు మేనిఫెస్టోలో చేర్చాలి

Emmiganuru: జర్నలిస్టుల సమస్యలు మేనిఫెస్టోలో చేర్చాలి

సానుకూలంగా స్పందించిన బుట్టా

జర్నలిస్టుల సమస్యలను రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టో లో చేర్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్లూజే) ఎమ్మిగనూరు తాలూకా అద్యక్షుడు బీ శ్రీనివాస నాయుడు, ప్రధాన కార్యదర్శి చిన్నాకుల నాగరాజు కోరారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా జాతీయ జర్నలిస్టుల కోరికల దినోత్సవం ను పురస్కరించుకొని ఎమ్మిగనూరు వైసిపి అభ్యర్థి బుట్టా రేణుక ను కలిసి వినతి పత్రం అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా బీ శ్రీనివాస నాయుడు, చిన్నాకుల నాగరాజు, జీబీ పరమేష్ మాట్లాడుతూ మీడియా కమిషన్ ను ఏర్పాటు చేసి జర్నలిస్టుల మీడియా భద్రకు జాతీయ స్థాయి లో ప్రత్యేక చట్టం చేయాలి. వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టాన్ని పునరుద్ధరించి దాడులను అరికట్టాలి. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.ఈ సమస్యలు ను వైసిపి మేనిఫెస్టో లో చేర్చే విధంగా చూడాలని బుట్టా రేణుక ను కోరారు. ఇందుకు బుట్టా రేణుక సానుకూలంగా స్పందించారు. మీరు ఇచ్చిన వినతి పత్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి తీసుకెళతానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో వైకాపా నాయకులు బుట్టా శివ నీలకంఠ, బుట్టా ప్రతుల్ తో పాటు ఏపీయూడబ్లూజే నాయకులు నూర్ అహమ్మద్, వీ రామకృష్ణ, ఎం ఈరన్న, బాబురాజు, శివ,అశోక్, ఆవుల శ్రీనివాసులు, సీ నాగరాజు, తిరుమల వెంకటేష్, బాలాజి కుమార్, బెస్త రవి, ఎల్లయ్య ఆచారి, వీరయ్య,గాజుల వెంకటేష్, అబ్దుల్లా, సీ ఈరన్న, ఎం రాజు, డాన్స్ రవి, బనవాసీ ఈరన్న, రాజు,నాగభూషణం,హరి,సునీల్ కుమార్, రహిమాన్, రంగన్న పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News