Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: బుట్టా రేణుక మాకు పోటీనే కాదు

Emmiganuru: బుట్టా రేణుక మాకు పోటీనే కాదు

ధన బలం ప్రజా బలం మధ్య పోటీ

హైదరాబాద్ లో వ్యాపారం చేసుకొనే బుట్టా రేణుక మాకు పోటీ కాదని ఎమ్మిగనూరు టీడీపీ నేతలు సరికొత్తగా ప్రచారం మొదలుపెట్టారు. ఎమ్మిగనూరులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వర్సెస్ బీవీ జయనాగేశ్వర రెడ్డి అనేది అసలు విషయమంటూ టీడీపీ బీసీ నేతలు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ పోటీలో విజయం టీడీపీదేనని వారు ధీమా వ్యక్తం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

ఎమ్మిగనూరు వైసిపి అభ్యర్థి బుట్టా రేణుక ధన బలం, టిడిపి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రజా బలం మధ్య పోటీ ఉంటుందని, అంతిమంగా బీవీదే విజయం అని టిడిపి బీసీ నాయకులు వీజీఏ దయాసాగర్ , రామదాసు గౌడ్, చేనేత మల్లికార్జునతో పాటు మాజీ కౌన్సిలర్ మధుబాబు అన్నారు.

స్థానిక టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పట్టణంలో బీసీ హిందూ స్మశాన వాటిక స్థలాన్ని వైసిపి నాయకులు అండతో కొందరు అక్రమ రిజిష్టర్ చేసుకొని కబ్జా చేయడానికి కుట్ర చేశారు. గత 2 ఏళ్లుగా ఈ వ్యవహారాన్ని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేస్వర రెడ్డి అడ్డుకోవాలని మాకు సూచించారు. దీంతో టిడిపి తరుపున మున్సిపల్ కౌన్సిల్ లో ప్రశ్నించామన్నారు. దీనిపై అధికారులు , వైసిపి సభ్యులు ఇంకా సమాధానం చెప్పలేదన్నారు. ఇప్పుడు అధికారుల తప్పిదం వల్లనే స్మశాన స్థలం వివాదం తలెత్తిందని వైసిపి నాయకులు చెప్పడం విడ్డూరమన్నారు. బీసీల అభివృద్ధి తెదేపా తోనే సాధ్యమని, ఎమ్మిగనూరుకు 3 బీసీ చైర్మన్ పదవులు ఇచ్చామని వైసిపి నాయకులు ప్రగాల్బాలు పలికారన్నారు. నిధులు, గదులు కుర్చీ లేని పదవులు ఎందుకు ఇచ్చారో చెప్పాలని వీరు డిమాండ్ చేశారు. బీసీ చైర్మన్లు ఏ ఒక్కరికైనా లబ్ది చేకూర్చారా అన్నదానిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News