Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: ఎమ్మెల్యే ఎర్రకోటకు ఎల్ఐసీ ఏజెంట్ల విజ్ఞప్తి

Emmiganuru: ఎమ్మెల్యే ఎర్రకోటకు ఎల్ఐసీ ఏజెంట్ల విజ్ఞప్తి

కమ్యూనిటీ హాల్ కు స్థలం కావాలని కోరిన ఏజెంట్లు

ఎల్ఐసి ఏజెంట్ల కమ్యూనిటీ హాల్ కు పట్టణంలో స్థలాన్ని ఇప్పించాలని లియాఫీ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు కే వెంకటేశ్వర్ రెడ్డి బి ప్రభాకర్ రెడ్డి ఆర్థిక కార్యదర్శి జెకె శివ రాముడు జోనల్ డివిజన్ నాయకులు ఆంధ్రయ్య, రమేష్, రంగస్వామి, హరినాథ్, ప్రభాకర్ కోరారు. ఆదివారం లియాఫీ (ఏజెంట్ల సంఘం) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆయన నివాసంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు బ్రాంచ్ లో ఎమ్మిగనూరు పట్టణం ఎమ్మిగనూరు నందవరం గోనెగండ్ల మంత్రాలయం కోడుమూరు సి బెళగల్ గూడూరు పత్తికొండ దేవనకొండ తుగ్గలి మద్దికేర మండలాల నుండి వెయ్యి మందికి పైగానే ఏజెంట్ బ్రాంచ్ కు వివిధ కార్యక్రమాలపై వస్తారని స్థలాన్ని కేటాయింపు చేస్తే కమిటీ హాల్ను నిర్మించుకుంటామని కోరారు. దేశవ్యాప్తంగా స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వ స్థలాల ఇప్పించుకొని కమిటీ హాలు నిర్మించుకున్నామని మీరు కూడా సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News