Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: నారా భువనేశ్వరిని కలిసిన మాచాని సోమనాథ్

Emmiganuru: నారా భువనేశ్వరిని కలిసిన మాచాని సోమనాథ్

ఎమ్మిగనూరు రాజకీయాలపై చర్చ

నిజం గెలవాలి యాత్రలో భాగంగా పత్తికొండ నియోజకవర్గం విచ్చేసిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని మర్యాదపూర్వం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు మాచాని సోమనాథ్. ఈ సందర్భంగా డాక్టర్ మాచాని సోమనాథ్ మాట్లాడుతూ చంద్రన్నను ముఖ్యమంత్రిగా చేయాలనే సంకల్పంతో బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నియోజకవర్గమంతా ప్రజల్లోకి తీసుకెళుతున్న విషయాన్ని వివరించారు.

- Advertisement -

తన ముత్తాత స్వర్గీయ పద్మశ్రీ మాచాని సోమప్ప ఎమ్మిగనూరుకు అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలలో కొనసాగుతున్నానని గుర్తు చేశారు. ఎమ్మిగనూరులో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై నారా భువనేశ్వరితో చర్చించారు. వారితో పాటు ఉన్న ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ, మాజీ మంత్రి గుమ్మనూరు జయరాములను కలిసి పరిచయం చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News