Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి ఉషాశ్రీ

Emmiganuru: అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి ఉషాశ్రీ

పిల్లల మానసిక అంశాలను గమనిస్తూ ఉండాలి

రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్ ఎమ్మిగనూరుకు వచ్చారు. ఎమ్మిగనూరు పట్టణంలోని సంజీవ నగర్ కాలనీలో 25, 26, 27 వ అంగన్వాడి కేంద్రాలను మంత్రి ఉషాశ్రీ చరణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రి ఉషా శ్రీ చరణ్ కు వైసిపి ఎమ్మిగనూరు నియోజకవర్గ నాయకుడు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికారు. మంత్రి ఉషాశ్రీ చరణ్ పౌష్టికాహారం కేంద్రంలో వారు పెడుతున్న ఆహారాన్ని అడిగి తెలుసుకున్నారు. పిల్లల మానసిక అంశాలను గమనిస్తూ ఉండాలని మంత్రి కోరారు.

- Advertisement -

కేంద్రంలో ఉన్న పౌష్టిక ఆహారం గుడ్లు, చిక్కి, పాలు, బియ్యం ను తనిఖీ చేసి గర్భిణీల స్త్రీలకు నాణ్యతమైన పౌష్టికాహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లలకు అక్షరాలు, రైమ్స్ వారితో చెప్పించారు. కేంద్రంలో ఉన్న ఇద్దరు చిన్నారులను వారి శరీరం బరువును మంత్రి స్వయంగా పరిశీలించారు. చిన్నారుల బరువు తగ్గుదల గల కారణాలను విశ్లేషించి తదనుగుణంగా పోషక ఆహారాన్ని అందించాలని మంత్రి పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఉంటున్న పిల్లల బరువు, ఎదుగుదల తక్కువగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి తెలిపారు. నిరంతరం అంగన్వాడి కేంద్రాలను ఉన్నత అధికారులు తనిఖీలు చేయాలన్నారు. విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

అనంతరం మంత్రి రిజిస్టర్లను హాజరు పట్టికను పరిశీలించారు. రికార్డులు సరిగా లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న భోజన సదుపాయాల గురించి  అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమామహేశ్వరమ్మ, సిడిపిఓ సఫర్ నిషా బేగం, చైర్మన్ డాక్టర్ రఘు, వైస్ చైర్మన్లు నజీర్ అహ్మద్,దివ్యకళ,టౌన్ బ్యాంక్ చైర్మన్ కొమ్ము రాజశేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News