కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం టిడిపిలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. టిడిపి నుండి సస్పెండ్ కు గురైన నందవరంకు చెందిన టిడిపి జిల్లా నాయకుడు నాగరాజు గౌడ్ ను స్థానిక టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయానాగేశ్వర రెడ్డి చేరదీశారు. గతంలో మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి కు నాగరాజు గౌడ్ ముఖ్య సహచరుడుగా ఉండేవాడు. ఆ తరువాత బీవీ మోహన్ రెడ్డి వారసుడుగా బీవీ జయ నాగేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచాక నాగరాజు గౌడ్, బార్య పుష్పవతి కు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా అయ్యారు. కొద్ది రోజుల తరువాత నాగరాజు గౌడ్, పుష్పవతి లతో మాజీ ఎమ్మెల్యే బీవీజేఅర్ కు విభేదాలు వచ్చాయి.2019 ఎన్నికలలో నాగరాజు గౌడ్ అసంతృప్తి తో బీవీజేఆర్ కు వ్యతిరేకంగా పనిచేశారని కారణంతో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, నందవరం మండలం టిడిపి నాయకులు కలిసి జిల్లా రాష్ట్ర అధిష్టానంకు ఫిర్యాదు చేసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు భావించి నాగరాజు గౌడ్, పుష్పవతిలను టిడిపి నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తో ఉత్తర్వులు ఇప్పించారు. దీంతో బీవీజేఆర్ పై నాగరాజు గౌడ్ దంపతులు పలు ఆరోపణలు చేశారు. వీరి ఆరోపణలను మిగతా టిడిపి నాయకులు ఖండించారు. ఇలా దాదాపు 5 ఏల్లు సాగాయి. వీరి మధ్య బంధం ఏలా బలపడిందో ఏమో కానీ గత రెండు నెలలుగా దర్మాపురం, పూలచింత గ్రామాలకు చెందిన ఇద్దరు నాయకులు మాజీ ఎమ్మెల్యే బీవీజేఅర్, నాగరాజు గౌడ్ ల మధ్య వ్యవహారం నడిపి రాజీ కూదిర్చిన్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి.
ఇటీవల చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలను నాగరాజు గౌడ్ నిర్వహించారు. దీనిని కూడా బీవీజేఅర్, ఆ ఇద్దరు నాయకులు కలిసి నాగరాజు గౌడ్ చేత చేయించారని చర్చ జరుగుతుంది. పార్టీకు నమ్మకంగా ఉంటున్న మమ్మల్ని కాదని కనీసం మాతో చేర్చకుండా నాగరాజు గౌడ్ ను పార్టీలో ఏలా చేర్చుకుంటారనీ ప్రశ్నిస్తున్నారు. టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మాధవ్ రావు దేశాయ్ తో మరో 4 మండల నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కు వ్యతిరేకంగా ఉంటూ వైసిపి కు అనుకూలంగా పని చేసిన నాగరాజు గౌడ్ ను తిరిగి పార్టీ లో తీసుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయ పడుతున్నారు.
మరో 2 రోజులలో అసంతృప్తి నేతలు తమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏప్రిల్ 28,29 తేదీలలో ఎమ్మిగనూరు నియోజకవర్గంకు వస్తున్నారు.ఇటువంటి పరిస్థితులలో నాగరాజు గౌడ్ చేరిక నందవరం మండలం టిడిపి నాయకులు కార్యకర్తలతో అలజడి రేపుతుంది. నందవరంకు చెందిన సామాజిక కర్త నెట్వర్క్ దేశాయ్ ను టిడిపి లో చేర్చుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతుంది. మాధవ్ రావు దేశాయ్ బహిరంగంగా సంతృప్తి వ్యక్తం చేస్తుండగా ముగతి ఈరన్న గౌడ్, రైస్మిల్లు నారాయణ రెడ్డి , లక్ష్మి నారాయణ రెడ్డి , చిన్న రాముడు కూడా అసంతృప్తి తో ఉన్నారా లేక అంగీకారమా అనేది తెలియాల్సి ఉంది. ఎవరైనా రాజీనామా చేసిన పరవరలే దని మాజీ ఎమ్మెల్యే బీవీజేఅర్ అంటున్నారని వార్తలు బయట చక్కర్లు కొడుతున్నాయి. కేవలం నందవరం మండలం లోనే కాక గోనెగండ్ల ,ఎమ్మిగనూరు మండలాలు ఎమ్మిగనూరు పట్టణంలో కూడా మాజీ ఎమ్మెల్యే బీవీజేఅర్ పై అసంతృప్తి తో ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం లో టిడిపి ,మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి పై అభిమానం నమ్మకంతో అవమానాలు, కస్టాలు,నష్టాలు వచ్చిన ఎదిరించి టిడిపి విజయానికి పాటుపడుతున్నమని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నాగరాజు గౌడ్ ను మాజీ ఎమ్మెల్యే బీవీజేఅర్ చెరదీయడం పై సమస్య పెరుగుతుందా సమసిపోతుందా అనేది వేచి చూడాలి.