ఇంటింటి సర్వే, స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2024 తుది ఓటర్ల జాబితాను జనవరి 5 వ తేది 2024 న ప్రచురించేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. ఎమ్మిగనూరు తహశీల్దారు కార్యాలయంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 పై తహశీల్దార్లు కె.అంజేయినేయులు, వేణుగోపాల్ శర్మ, నిత్యానంద రాజు, ఎలక్షన్ తహశీల్దార్ గురు రాజా రావుతో కలిసి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 లో ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా బాధ్యతాయుతంగా నిర్వహిస్తామన్నారు. ఎఈఆర్వో, బూత్ లెవెల్ అధికారులకు ఇప్పటికే స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 కి సంబంధించిన శిక్షణ తరగతులు నిర్వహించామని, ఆగస్టు 21, 2023 వరకు బూత్ లెవెల్ స్థాయి అధికారులతో ఇంటింటి ఓటర్ల పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత అందుకు సంబంధించిన మార్పులు, చేర్పులు, తొలగింపులు చేయడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీల కు అపోహాలు ఉంటే పిర్యాదు చేయవచ్చు. బూత్ స్థాయి ఏజెంట్ల జాబితాను బూత్ లెవల్ ఏజెంటులను నియమించి వారి జాబితాను వైసిపి మినహా మిగిలిన పార్టీ లు సమర్పించలేదు. గుర్తింపు పొందిన అన్ని పార్టీల నాయకులు బూత్ లెవల్ ఏజెంటులను నియమించి వారి జాబితాను కార్యాలయం కు సమర్పించి సహకరించాలని సబ్ కలెక్టర్ పార్టీ నాయకులు సూచించారు.ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 271 పోలింగ్ కేంద్రాలు, బి ఎల్ వో లు 271, ప్రస్తుతం నియోజకవర్గ ఓటర్స్ 2 లక్షల 34 వేల 991 మంది ఓటర్స్ ఉన్నారు, వారిలో పురుషుల ఓటర్స్ ఒక లక్ష 16 వేల 542 ఓటర్స్ ఉన్నారు, మహిళల ఓటర్స్ ఒక లక్ష 18 వేల 396 ఓటర్స్ ఉన్నారు, అధర్స్ ఓటర్స్ 43 మంది ఉన్నారని అన్నారు. కార్యాలయమునకు సమర్పించా లని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సబ్ కలెక్టర్ సూచించారు. సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి బుట్ట రంగయ్య, తెలుగుదేశం నుండి మహేబబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.
Emmiganuru: కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమం
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES