Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: ప్రవీణ్ ప్రకాశ్ తీరు మార్చుకోవాలి

Emmiganuru: ప్రవీణ్ ప్రకాశ్ తీరు మార్చుకోవాలి

ప్రభుత్వ పాఠశాలలో తనిఖీలు పేరుతో ఉపాధ్యాయులను సపెన్స్ చేస్తున్న ఉన్నత విద్య అధికారి ప్రవీణ్ ప్రకాశ్ తీరు మార్చుకోవాలనీ లేకపోతే ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురికావల్సి వస్తుందనీ ఎమ్మిగనూరు ఫ్యాప్టో ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ సంఘాల సమాఖ్య కన్వీనర్ గొట్ల చంద్ర శేఖర్, ఎస్టీయూ రాష్ట్ర బాధ్యులు జీ బసవరాజు, యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు నాగమణి, ఏపిటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవి కుమార్, బీటీఏ రాష్ట్ర కార్యదర్శి పి మాదన్న హెచ్చరించారు. స్థానిక పాత తహసీల్దార్ ముందు ఫ్యాప్టో అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలు తనిఖీలను ఆహ్వానిస్తామని కానీ ఆ పేరు తో ఉపాధ్యాయులను సమాజంలో చులకన చేసే రీతిలో ప్రవీణ్ ప్రకాశ్ చర్యలు ఉండటం వ్యవహరించడం సరైన విధానం కాదు. బోధనకు సమయం కేటాయించకపొగ బోధనయేతర పనులు చేయిస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘాల సమాఖ్య ( ఫ్యాప్టో) నాయకులు ఎండి శ్రీనివాసులు , వెంకటేశ్వర్లు, రాళ్ళదొడ్డి రామాంజనేయులు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News