Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: ప్రజలకు అండగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్

Emmiganuru: ప్రజలకు అండగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్

కవాతు చేసి భరోసా ఇచ్చి..

ప్రజలకు అండగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పని చేస్తుందని ఎమ్మిగనూరు డిఎస్పీ బి సీతారామయ్య అన్నారు. సిఐలు కె.మధుసుధన్ రావు, కె మోహన్ రెడ్డి, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ టి పి.బాఘేల్ అధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలో కవాతు చేపట్టారు. ఇన్స్పెక్టర్ ఏ కె.శర్మ, ఇన్స్పెక్టర్ రాబిన్ బాబు, ఇన్స్పెక్టర్ జటా శంకర్ తోపాటు 99వ బెటాలియన్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 65 మంది సైనికులతో పట్టణ పోలీస్టేషన్ నుండి సోమప్ప సర్కిల్, బంగారు బజార్,తేరుబజార్, సోమేశ్వర సర్కిల్ మీదుగా భారీ కవాతు నిర్వహించారు. ఈసందర్భంగా డిఎస్పీ బి సీతారామయ్య, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ టి పి బాఘేల్ మాట్లాడుతూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ టిపి బాఘేల్ హైదరాబాద్ నుండి వచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం మతకల్లోలాలు,ఫ్యాక్షన్, లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏర్పడితే స్థానిక పోలీసులకు సహాయపడేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏర్పడిందన్నారు. ఎమ్మిగనూరు ప్రజలకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ గురించి తెలియాలనే ఉద్దేశ్యంతోనే ఫ్లాగ్ మార్చ్ చేపట్టాం. ఈకార్యక్రమంలో పట్టణ, గ్రామీణ ఎస్ఐ లు మస్తాన్ వలీ,రమేష్, నిరంజన్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News