Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం

Emmiganuru: టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం

ప్రతి టీడీపీ కార్యకర్త, నాయకులు పసుపు చొక్కా, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డుతో హాజరు కావాలి

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు జూన్ 12న సోమవారం ఉదయం 9:30 నిమిషాలకు ఎమ్మిగనూరు తాలూకా టిడిపి విస్తృత స్థాయి సమావేశం ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప మెమోరియల్ హాల్ నిర్వహిస్తున్నట్లు టిడిపి మండల అధ్యక్షులు జి మల్లికార్జున తెలిపారు. ఎమ్మిగనూరు మండల కార్యకర్తలు నాయకులతో టిడిపి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మిగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు, అన్ని గ్రామల కమిటీ, మండల కమిటీ సభ్యులు, మండల అనుబంధ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు అందరూ తప్పకుండా హాజరై ఈ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశమును విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశమునకు హాజరవుతున్న ప్రతి టీడీపీ కార్యకర్త, నాయకులు పసుపు చొక్కా, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డుతో హాజరు కావాలని తెలిపారు. సమావేశంలో టిడిపి నాయకులు బోయ కేశన్న, సోమేష్ రెడ్డి, మురళి కృష్ణ రెడ్డి, అయ్యలప్ప, రఘు, రాఘవేంద్ర, కొండన్న గౌడ్, శంకర్ గౌడ్, నాగరాజు, సురేష్ చౌదరి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News