మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని 1627 గ్రూపులు 13,912 మంది స్వయం సహాయక పొదుపు మహిళలకు వైయస్ఆర్ ఆసరా పథకం 3 విడత కింద మంజూరైన రూ. 9,80,58,151/- చెక్కును ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, వైసిపి నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డిలు అందజేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో పొదుపు మహిళల కష్టాలు నేరుగా తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం విడతల వారీగా రుణం మాఫీ చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం కేవలం హామీలు ఇచ్చి ప్రలోభ పెట్టిందేకానీ అమలు చేయడంలో విఫలమై మహిళలను మోసం చేసిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కో ఇంటికి రూ. 2లక్షల నుంచి 3లక్షల వరకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని వివరించారు.
ప్రతి నెలా, ప్రతి సంవత్సరం అందరికీ పెన్షన్, అమ్మ ఒడి, ఆసరా లాంటి 25 పథకాలను నేరుగా బటన్ నొక్కి, ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వచ్చి పడేలా జగనన్న కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమలోమున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెస్.రఘు, కమిషనర్ ఎన్. గగిరెడ్డి, వైస్ చైర్మన్లు నజీర్ అహ్మద్, కే దివ్యకళ, వైసిపి నాయకులు బుట్టా రంగయ్య, కె. సునీల్ కుమార్, పట్టణ జేసిఎస్ కన్వీనర్, భంగి శ్రీరాములు, కో ఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబ్బీర్ ఆహ్మద్, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్, మోప్మా సమఖ్య అధ్యక్షురాలు హేమలత రెడ్డి, పాల్గొన్నారు.