తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఉద్యోగులు ఆందోళనకు దిగారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట నిరసన చేపట్టారు. ఉద్యోగికి క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
- Advertisement -
కాగా రెండు రోజుల క్రితం శ్రీవారి మహాద్వారం వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగి బాలాజీపై బోర్డు సభ్యుడు నరేశ్ బూతులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. పవిత్రమైన తిరుమల ఆలయంలో టీటీడీ సభ్యుడు ఇలా బూతులతో విరుచుపడటం ఏంటని తీవ్ర విమర్శలు వచ్చాయి. మరోవైపు ఈ ఘటనపై ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉద్యోగులంటే అంత చిన్న చూపా అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.