Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. అశ్వవాహన సేవలో శ్రీమలయప్ప స్వామి

Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. అశ్వవాహన సేవలో శ్రీమలయప్ప స్వామి

Ashwa Vahanam: తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి కీలక ఘట్టానికి చేరుకున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో స్వామివారి వాహన సేవలు అశ్వవాహన సేవతో పరిసమాప్తమయ్యాయి.

- Advertisement -

రాత్రి పూట జరిగిన ఈ అశ్వవాహన సేవలో శ్రీమలయప్ప స్వామివారు అలంకార భూషితులై, కల్కి అవతారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. భగవంతుడి దశావతారాలలో చివరిది కల్కి అవతారం. కలియుగం చివరిలో ధర్మాన్ని నిలబెట్టడానికి, దుష్టశిక్షణ కోసం ఈ అవతారం ధరించనున్నట్లు పురాణాలు చెబుతాయి. అశ్వంపై కల్కి రూపుడై ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమాడ వీధుల్లో అశేష సంఖ్యలో భక్తులు పోటెత్తారు.

మొత్తం బ్రహ్మోత్సవాల్లో శ్రీవారు 14 విభిన్న వాహనాలపై భక్తులకు దర్శనం ఇచ్చి, కటాక్షించారు. ఈ రోజుతో స్వామివారి వాహన సేవలు ముగియడంతో, భక్తులు భక్తిపారవశ్యంతో జై శ్రీమన్నారాయణ అంటూ నినాదాలు చేశారు.

ఈ అద్భుతమైన వాహన సేవలో TTD ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మరియు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల చివరి ఘట్టం గురువారం ఉదయం చక్రస్నానం, రాత్రికి ధ్వజావరోహణంతో పూర్తవుతుంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad