Wednesday, October 23, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

AP Cabinet| ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన కేబినెట్ జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం.. దాదాపు 3 గంటల పాటు జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(PawanKalyan)తో పాటు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ముఖ్యంగా దీపావళి కానుకగా మహిళలకు ఉచిత సిలిండర్ల పథకంపై సుదీర్ఘ చర్చ జరిగింది. రేపటి(గురువారం) నుంచి ఈనెల 30 వరకు ఉచిత సిలిండర్ల పథకానికి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం అర్హులకు ఉచితంగా సిలిండర్లు ఇవ్వనున్నారు.

- Advertisement -

అలాగే గత వైసీపీ ప్రభుత్వం అమల్లోకీ తీసుకొచ్చిన చెత్త పన్ను రద్దు అమలు విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు దేవాలయాల పాలక మండలి సభ్యుల సంఖ్యను 15 నుంచి 17 వరకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు బ్రాహ్మణులు పాలకమండలిలో ఉండాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా ఉచితంగా ఇసుక పంపిణీ పథకంలో ట్రాక్టర్లు, లారీలతో పాటు ఎడ్ల బండ్లలో కూడా ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పథకం అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు మంత్రులకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. మంత్రులు ప్రో యాక్టివ్‌గా పనిచేయాలని స్పష్టం చేశారు. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో మంత్రులు వేగంగా, సమర్ధంగా పనిచేయాలంటూ సూచించార. తనతో పాటు సమానంగా పనిచేయాలన్నారు. ఇంకా కొందరు పని విషయంలో నిర్లిప్తంగా ఉన్నారని.. ఇలాగే ఉంటే మంత్రివర్గంలో కొనసాగలేరని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News