Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్ISRO : పీఎస్ఎల్వీ సీ54 మిషన్ ప్రయోగం సక్సెస్.. కక్ష్యలోకి 9 ఉపగ్రహాలు

ISRO : పీఎస్ఎల్వీ సీ54 మిషన్ ప్రయోగం సక్సెస్.. కక్ష్యలోకి 9 ఉపగ్రహాలు

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ఈ మేరకు ఇస్రో సంస్థ ట్వీట్ చేసింది. ప్రయోగం సక్సెస్ అవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమవగా.. ఈ రోజు ఉదయం (నవంబర్ 26) 11.56 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది పీఎస్‌ఎల్‌వీ-సీ54.

- Advertisement -

9 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ54 విజయవంతంగా వాటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈవోఎస్ 06 (ఓషన్ శాట్ 03) అనే ఉపగ్రహంతో పాటు మరో ఎనిమిది ఉపగ్రహాలను పంపింది ఇస్రో. వాటిలో మూడు దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలూ ఉన్నాయి. భారత్‌‌కు చెందిన తైబోల్ట్‌–1, తైబోల్ట్‌–2, ఆనంద్, ఇండియా – భూటాన్‌ దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అకా ఐఎన్‌ఎస్‌–2బీ, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకాస్ట్‌ –2 పేరుతో నాలుగు శాటిలైట్లను ఇస్రో పీఎస్ఎల్వీ -సీ54 నింగిలోకి మోసుకెళ్లింది. ఓషన్ శాట్ ఉపగ్రహాల ద్వారా భూ వాతావరణం పరిశీలన, తుఫానులను పసిట్టడం, వాతావరణంలో తేమ, అంచనా, సముద్రాల మీద వాతావరణం అధ్యయనం చేయనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News