నంద్యాల (తెలుగు ప్రభ): నంద్యాల – చెన్నై మధ్య రైలు ప్రయాణం అనుసంధానం చేయాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను కోరారు. నంద్యాల, మార్కాపురం ఆంధ్రప్రదేశ్ సమీప ప్రాంతాల మధ్య చెన్నైతో మెరుగైన రైలు అనుసంధానం కోరుతూ ప్రభుత్వానికి వినతులు అందాయా? అలా అయితే, దాని వివరాలు తెలియజేయాలని పేర్కొన్నారు. చెన్నైని నంద్యాల, సమీప ప్రాంతాలతో కలిపే ప్రత్యక్ష రైలు సర్వీసును ప్రవేశపెట్టే సాధ్యాసాధ్యాలను భారత ప్రభుత్వం పరిశీలించాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విజ్ఞప్తి చేశారు. నంద్యాల ప్రాంతానికి, చెన్నైకి మధ్య రైలు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి తీసుకున్న లేదా ప్రతిపాదించిన చర్యల వివరాలు తెలియజేయాలని, నంద్యాల, కడప, తిరుపతి మీదుగా చెన్నై రైలు ప్రయాణం అనుసంధానం మా ప్రాంత అభివృద్ధికి దోహదపడుతోందని, కలియుగ ప్రతక్ష ధైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు కూడా ఎంతో ఉపయోగకరమని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందిస్తూ.. రైల్వేలు, సమాచార & ప్రసార, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖల మంత్రి
నుండి ప్రస్తుతం, నంద్యాల-మార్కాపూర్ రోడ్ స్టేషన్లు రెండూ 18 రైలు సర్వీసుల ద్వారా విజయవాడకు అనుసంధానించబడి ఉన్నాయని, అక్కడి నుండి 158 రైలు సర్వీసుల ద్వారా చెన్నైకి అనుసంధానించబడి ఉందని, నంద్యాల-మార్కాపూర్ రోడ్-విజయవాడ సెక్టార్, విజయవాడ-చెన్నై సెక్టార్లకు సేవలు అందిస్తున్న రైళ్ల జాబితాలు ఉన్నాయని తెలిపారు.
Also Read: Scam : డీఎస్సీ దందాపై దండెత్తిన మడకశిర.. లోకేష్ రాజీనామాకు డిమాండ్!

