HomeTop StoriesYS Jagan: 'సోదరుడు విజయ్‌కి హృదయపూర్వక అభినందనలు.. దీదీకి నా సానుభూతి'

YS Jagan: ‘సోదరుడు విజయ్‌కి హృదయపూర్వక అభినందనలు.. దీదీకి నా సానుభూతి’

EX CM Jagan: ఈ రోజు వెలువడుతున్న నాలుగు రాష్ట్రాలు తమిళనాడు, కేరళం, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ప్రధానంగా తమిళ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నటుడు విజయ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/nda-alliance-leads-in-bengal-and-assam-response-of-chandrababu-and-lokesh/

తమిళనాడులో తన రాజకీయ పార్టీ టీవీకే ద్వారా అద్భుత విజయాన్ని అందుకున్న విజయ్‌ను మాజీ సీఎం జగన్‌ ప్రశంసించారు. ఆయన విజయాన్ని “తొలి అడుగులోనే అద్భుతం” అని కొనియాడారు. ప్రజాసేవలో విజయ్‌ మొదలుపెడుతున్న ఈ కొత్త ప్రయాణం విజయవంతం కావాలని జగన్‌ ఆకాంక్షించారు. 

పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంపై ప్రధాని నరేంద్ర మోదీకి జగన్‌ అభినందనలు తెలిపారు. బెంగాల్ ఫలితాల్లో ఆశించిన విజయం సాధించలేకపోయిన మాజీ సీఎఁ మమతా బెనర్జీకి తన సానుభూతిని వ్యక్తం చేశారు. 

Also Read: https://teluguprabha.net/national-news/tvk-got-one-crore-28-lakh-votes-and-vijay-won-perambur-constituency/

‘సోదరుడు విజయ్‌కి హృదయపూర్వక అభినందనలు. మీరు పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం చాలా గొప్ప విషయం. ప్రజాసేవలో మీరు మొదలుపెడుతున్న ఈ కొత్త ప్రయాణం విజయవంతం కావాలి. దీదీ మమతా బెనర్జీకి నా సానుభూతి. బీజేపీ, ఇతర విజేతలకు నా అభినందనలు.’ -వైఎస్‌ జగన్‌

మరోవైపు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ ఫలితాలపై స్పందించారు. ప్రజల తీర్పును గౌరవించాలని, పాలన నచ్చకపోతే ఓటర్లు నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News