Grandhi Srinivas| వైసీపీ(YCP)కి షాక్‌ల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే ఆ పార్టీ అధినేత జగన్(YS Jagan)కు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్(Avanti Srinivas) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా చేసిన కాసేపటికే మరో సీనియర్ నేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంలో ఇతర పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు.
ఇదిలా ఉంటే పల్నాడు జిల్లాలో జగన్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సరస్వతి పవర్ ఇండస్ట్రీస్(Saraswati Power Industries)లోని అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొత్తం 17.69 ఎకరకాలను స్వాధీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే జగన్‌కు మూడు భారీ షాకులు తగిలాయి. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కూడా డీలా పడిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థంకాక తీవ్ర నైరాశ్యం చెందుతున్నారు.