తిరుపతి తొక్కిలసలాట ఘటన మరువక ముందే తిరుమల(Tirumala) శ్రీవారి సన్నిధిలో మరో విషాదం చోటుచేసుకుంది. తిరుమల లడ్డు కౌంటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. 47వ కౌంటర్ కంప్యూటర్ UPSలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన టీటీడీ అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Tirumala: తిరుమల లడ్డు కౌంటర్‌లో అగ్ని ప్రమాదం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES