Homeఆంధ్రప్రదేశ్Food poisoning scare: గుంటూరులో కలకలం.. ఫుడ్‌ పాయిజన్‌తో 50 మంది ఆసుపత్రి పాలు

Food poisoning scare: గుంటూరులో కలకలం.. ఫుడ్‌ పాయిజన్‌తో 50 మంది ఆసుపత్రి పాలు

Food poisoning scare in Guntur: గుంటూరు జిల్లాలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటన ఒక్కసారిగా స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాడైపోయిన ఆహారాన్ని తిన్న 50 మంది గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో బుధవారం ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకలో అతిథులకు భోజనాలు వడ్డించారు. అయితే, ఆరోజు ఫంక్షన్‌లో మిగిలిన బిర్యానీని మరుసటి రోజు (గురువారం) కొందరు గ్రామస్థులు తిన్నారు. దీంతో, అదే రోజు రాత్రి నుంచి 50 మంది తీవ్ర వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో 44 మంది కోలుకోగా.. మరో ఆరుగురిని స్థానికులు తెనాలి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్‌పాయిజన్‌ సమాచారం అందుకున్న వెంటనే.. డీఎంహెచ్‌వో విజయలక్ష్మి కొత్తరెడ్డిపాలెం గ్రామాన్ని సందర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని స్థానిక వైద్యారోగ్య సిబ్బందిని ఆదేశించారు. అయితే, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/kalvakuntla-kavitha-sensational-comments/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News