ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu) అరెస్ట్ అయ్యారు. ముంబై నటి కాదంబరి జత్వానీకి వేధింపుల కేసులో సీఐడీ అధికారులు ఆయనను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడ తరలించారు. గత వైసీపీ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. జత్వానీ కేసులో పీఎస్‌ఆర్ రెండో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ సస్పెండ్ అయ్యారు. అలాగే పీఎస్‌ఆర్ ఆంజనేయులు కూడా సస్పెన్షన్‌లో ఉన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ హయాంలో అధికారులు తమ పట్ల వ్యవహరించిన తీరుపై జత్వానీ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో విద్యాసాగర్‌తో పాటు పీఎస్‌ఆర ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీలపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.