ఏపీ మాజీ సీఎం జగన్(YS Jagan) బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ బదిలీకి సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్లలో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కేసును విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం నుంచి జస్టిస్ బీవీ నాగరత్న, జస్టీస్ సతీశ్‌చంద్ర శర్మ ధర్మాసనానికి మార్చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
YS Jagan: మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES