Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Jogi Ramesh: విజయవాడ నుంచి నెల్లూరుకు జోగి రమేశ్ తరలింపు: కస్టడీపై కోర్టు కీలకం నిర్ణయం

Jogi Ramesh: విజయవాడ నుంచి నెల్లూరుకు జోగి రమేశ్ తరలింపు: కస్టడీపై కోర్టు కీలకం నిర్ణయం

Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో అరెస్టయిన వైసీసీ ముఖ్య నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ మరియు ఆయన సోదరుడు రాముల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ఏపీ ఎక్సైజ్‌ శాఖ, కీలక వివరాలను రాబట్టేందుకు వారిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.

- Advertisement -

పది రోజుల కస్టడీ కోరిన ఎక్సైజ్
ఈ కేసులో ఇంకా వెలికి తీయాల్సిన రహస్యాలు, ముఖ్యంగా ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయనే అనుమానంతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు జోగి రమేశ్‌, రామును 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు తర్వాతే కస్టడీపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

నెల్లూరు జైలుకు తరలింపు
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావుతో మాజీ మంత్రి జోగి రమేశ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీయడానికి సిట్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో అరెస్ట్ చేసిన తర్వాత, తూర్పు ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో దాదాపు 12 గంటల పాటు జోగి రమేశ్‌, రాములను వేర్వేరుగా, కలిపి ప్రశ్నించారు.

అనంతరం, వైద్య పరీక్షలు పూర్తి చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా, అర్ధరాత్రి దాటిన తర్వాత వాదనలు మొదలయ్యాయి. న్యాయమూర్తి తెల్లవారుజామున 5 గంటలకు తీర్పు వెలువరిస్తూ, వారికి ఈ నెల 13 వరకు రిమాండ్‌ విధించారు. ఈ నేపథ్యంలో, వారిద్దరినీ విజయవాడ సెంట్రల్ జైలు నుంచి నెల్లూరు జైలుకు తరలించడం జరిగింది.

ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అద్దేపల్లి సోదరులను కూడా ఎక్సైజ్ శాఖ రెండోసారి తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ ఈ నెల 6వ తేదీకి వాయిదా పడింది. మాజీ మంత్రి కస్టడీ పిటిషన్‌పై మంగళవారం విచారణ అనంతరం కోర్టు తీర్పు ఈ కేసు విచారణలో అత్యంత కీలకం కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad