HomeTop StoriesRajini: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. హైకోర్టు ఆదేశాలతో పాస్‌పోర్టు అప్పగించిన మాజీ మంత్రి

Rajini: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. హైకోర్టు ఆదేశాలతో పాస్‌పోర్టు అప్పగించిన మాజీ మంత్రి

Ex Minister Rajini: వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని హైకోర్టు ఆదేశాల మేరకు తన పాస్‌పోర్టును నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో శనివారం అధికారులకు అప్పగించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేత పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ మంత్రి విడదల రజినితో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/sports-news/cti-chairmans-letter-to-organize-ipl-season-without-spectators/

కాగా, ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం రజిని హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆమె విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు తక్షణమే తన పాస్‌పోర్టును పోలీసులకు సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం నిర్దేశించిన నిబంధనల ప్రకారం, మాజీ మంత్రి రజిని ప్రతి ఆదివారం చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌కు హాజరై రిజిస్టర్‌లో సంతకం చేయాల్సి ఉంటుంది. 

Also Read: https://teluguprabha.net/telangana/actor-manchu-manoj-started-trust/

హైకోర్టు ఆదేశాల మేరకు, విడదల రజిని పల్నాడు జిల్లా నరసరావుపేట డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని సంబంధిత పోలీసు అధికారులకు తన పాస్‌పోర్టును అధికారికంగా సరెండర్‌ చేశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News