Homeఆంధ్రప్రదేశ్kidnapping case: కిడ్నాప్‌ కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే అరెస్టు

kidnapping case: కిడ్నాప్‌ కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే అరెస్టు

Former YCP MLA arrested: గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే షేక్‌ మహమ్మద్‌ ముస్తఫాను పోలీసులు అరెస్టు చేశారు. సంచలనం సృష్టించిన పొగాకు వ్యాపారి కుమారుడి కిడ్నాప్‌ కేసులో భాగంగా అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో నూజివీడు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి ఈ అరెస్టు జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

కిడ్నాప్‌ కేసు నేపథ్యం: వ్యాపార లావాదేవీలు మరియు వివాదాల నేపథ్యంలో.. పొగాకు వ్యాపారి కుమారుడితో పాటు మరో ముగ్గురిని కిడ్నాప్‌ చేసి, వారిని బెదిరింపులకు గురిచేశారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే షేక్‌ మహమ్మద్‌ ముస్తఫాతో పాటు ఆయన కుమారుడు బషీర్‌లపై నూజివీడు పోలీసులు ఇదివరకే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ముస్తఫా కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. తాజాగా గుజరాత్‌లో ఆయన్ని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యలు నిమిత్తం తరలిస్తున్నారు.

Also Read-Byreddy Shabari: నంద్యాల-చెన్నై మధ్య రైలు అనుసంధానం చేయండి.. లోక్‌సభలో ఎంపీ బైరెడ్డి శబరి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News