కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్(Nandigam Suresh)ను వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే అమరావతితో మరియమ్మ అనే మహిళ హత్య కేసులో దాదాపు 5 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఇటీవలే అనారోగ్యంతో బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా అమరావతి ఉద్యమంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ మండవ మహాలక్ష్మి అనే మహిళ 2020లో అమరావతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సురేష్‌తో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండంటంతో ఈ కేసు ముందుకు కదల్లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ కేసులో మళ్లీ కదలిక వచ్చింది. దీంతో అప్రమత్తమైన నందిగం సురేష్ ముందుగానే సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట లొంగిపోయారు. వెంటనే అతడి తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.