ఉయ్యాలవాడ మండల టిడిపి పార్టీలో నూతనోత్తేజం నెలకొంది. గ్రామంలో వైసీపీ నుండి టిడిపి పార్టీలోకి భారీ ఎత్తున 180 కుటుంబాలు చేరడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. మాజీ మంత్రి అఖిలప్రియ సమక్షంలో గ్రామానికి చెందిన వైసిపి ఎంపీటీసీ సభ్యురాలు కర్రా రాధ, సర్పంచ్ బండి మరియమ్మ ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ హజరత్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామచంద్రుడు, పంచాయతీ 6వ వార్డు మెంబర్లు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటుగా వారి అనుచరులు, 180 కుటుంబాల వారు టిడిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి అఖిలప్రియ ఆళ్లగడ్డ టిడిపి అభ్యర్థిత్వన్ని ఖరారు చేసి టికెట్టు ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఉయ్యాలవాడ మండలానికి విచ్చేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కు,భూమా జగత్విఖ్యాత రెడ్డి లకు గ్రామస్థులు , టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని వీధులలో కుడా అడుగడుగునా ప్రజలు వారికి నీరాజనాలు పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ వైసిపి స్వయంకృతాపరాధం వల్ల రాష్ట్రంలో ఈరోజు ఉనికిని కోల్పోయే ప్రమాదం తెచ్చుకుందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం అధికారాలు కల్పించలేకపోవడం, మండల గ్రామ నేతలతో సరైన కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఈరోజు టిడిపి పార్టీలోకి వైసీపీ నుండి స్వచ్ఛందంగా వలసలు వచ్చి చేరుతున్నారని తెలిపారు.
గ్రామానికి చెందిన కర్రా కుటుంబం తిరిగి పాత గూటికే చేరడం ఎంతో హర్షనీయమన్నారు. యువనేత భూమా విఖ్యాత రెడ్డి మాట్లాడుతూ పెద్ద ఎమ్మనూరు గ్రామంలో గడచిన ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని కమిషన్ల కోసం ఎమ్మెల్యే కక్కుర్తి పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టిడిపి పార్టీ విజయం సాధించిన తర్వాత గ్రామ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని భూమా హామీ ఇచ్చారు.