Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Gangula: అందరికి సంక్షేమ ఫలాలు

Gangula: అందరికి సంక్షేమ ఫలాలు

అధికారం కోసం అబద్ధాలు -టీడీపీ అజెండా

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే మా లక్ష్యం అని ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని కోటకొండ గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ డేగాని వెంకటేష్ ఆధ్వర్యంలో ఎంపీడీవో మధుసూదనరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టి, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటిముందుకే చేరుస్తున్న ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్డీవో శ్రీనివాసులు, ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి, జెడ్పిటిసి మాధవి, ఎంపీపీ మబ్బు బాలస్వామి, తహాశీల్దార్ రవీంద్ర ప్రసాద్, రుద్రవరం వైసీపీ సీనియర్ నాయకుడు గంగిశెట్టి తిమ్మయ్య శెట్టి, రామకృష్ణ పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆయా శాఖల అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News