Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలన్నదే వైసిపి లక్ష్యం

Gangula: ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలన్నదే వైసిపి లక్ష్యం

మళ్లీ మాకే ఓటేయాలి

ఆళ్లగడ్డ పట్టణ మున్సిపాలిటీ 1వసచివాలయం పరిధిలోని వివర్స్ కాలనీ ,నంద్యాల రోడ్డులోని శిల్పాకళా మందిరం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పాల్గొన్నారు. కాలనీ చేరుకున్న ఆయనకు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటిగడపకు వెళ్ళి ఆప్యాయత, అనురాగాలతో పలకరించి, వారికి ఇచ్చిన బుక్ లెట్ ద్వారా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని కుటుంబ సభ్యులను అడిగి ఆరా తీసి, ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గంగుల తెలిపారు.

- Advertisement -

కాలనీ ప్రజలు సమస్యలను ఏమున్నా తమ దృష్టికి తేవాలని వాటికి వెంటనే సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని సచివాలయం సిబ్బందికి వాలంటీర్లకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో వైయస్. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరి చల్లని దీవెనలు అందించి ఆదరించాలని ఎమ్మెల్యే గంగుల కోరారు. కౌన్సిలర్లు గోట్లూరు సుధాకర్ రెడ్డి , గురుమూర్తి ,బాలబ్బి, కో ఆప్షన్ మెంబర్ రమేష్ గౌడ్, సింగం వెంకటేశ్వర్ రెడ్డి, కొత్తూరు సునీల్, దామోదర్ రెడ్డి ,రాజారెడ్డి ,అన్ని శాఖల అధికారులు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.


సాయంత్రం సిరివెళ్ల మండలం గోవిందా పల్లి గ్రామంలోని 1వసచివాలయం పరిధిలోని 4,7,8,10ముల్లాపేట, గొల్లపేట ,దూదేకుల వీధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పాల్గొన్నారు. గోవిందపల్లి చేరుకున్న ఆయనకు ఇందూరు ప్రతాపరెడ్డి , సలాం వైకాపా నాయకులు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రతి వీధి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు గురించి వివరించి ఇంకా సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే అప్లై చేసుకోవాలని వీధుల్లో ఏ సమస్యలున్నా తమ దృష్టికి తేవాలని వాటిని వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గంగుల కోరారు .ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూరాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వంఏర్పాటుచేసిందన్నారు. ఈకార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News