Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: చంద్రబాబు ప్రజల సొమ్మును అప్పనంగా మింగేశాడు

Gangula: చంద్రబాబు ప్రజల సొమ్మును అప్పనంగా మింగేశాడు

'గడప గడపకు'లో ఎమ్మెల్యే..

ఆళ్లగడ్డ మున్సిపాలిటీ 3వ సచివాలయం పరిధిలోని పినాగిరెడ్డి పల్లెలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో శాసన సభ్యులుగంగుల బ్రిజెంద్రారెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నాయకులు కేంద్ర మాజీ కాటన్ బోర్డు మెంబర్ శ్రీనివాస రెడ్డి బద్రి సుధాకర్ రెడ్డి, బద్రి భాస్కర్ రెడ్డి, కేకే రెడ్డి, చింతకుంట శ్రీనివాస రెడ్డి, రామ సుధాకర్ రెడ్డి, చింతకుంట శశి కుమార్ రెడ్డి, చింతకుంట చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలు గురించి అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందేయా లేదా, ఇంకా అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారుంటే సచివాలయంలో కానీ, తనకు స్వయంగా తెలపాలన్నారు. సమస్యలుంటే తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. అక్కడున్న సమస్యలను కొన్నింటిని అధికారులకు తెలిపి వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్మును మింగేసాడని తనుకు ఏ పాపం ఎరగనట్లు నటించడంలో తనకు తానే సాటి అన్నట్లు ఉన్నారన్నారు. ఆయన అధికారంలో ఉండగా సిల్క్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో 370 కోట్ల రూపాయలు తన ఖాతాలో వేసుకున్నారన్నారు. ప్రభుత్వం న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకొని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. చట్టం తనపని తాను చేసుకోపోయిందని ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదని, టిడిపి నాయకుని అసలు స్వరూపం బయటపడిందన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు ఏఈలు సురేంద్రనాథ్ రెడ్డి, కంబగిరి, బాలస్వామి వీఆర్వో రామకృష్ణ అన్ని శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News