దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం వైసిపి ప్రభుత్వమేనని ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్ర రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఆర్ నాగులవరం గ్రామ సచివాలయం పరిధిలో గల ఆర్ కొత్తపల్లె, టి లింగందిన్నె గ్రామాలలో ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు గ్రామాలలో గడపగడపకు వెళ్లి నవరత్నాలలో భాగంగా ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధి పొందిన వారికి బుక్లెట్ లోని వివరాలను వివరించారు. అర్హులై ఉండి ఏమైనా కారణాల చేత సంక్షేమ పథకాలు అందుకుంటే తన దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరించి వారికి సంక్షేమ పథకాలు లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు సూచించారు. ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు తదితర అంశాలపై పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
మళ్ళీ తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ఓట్లు వేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి, వైసిపి నాయకులు సింగతల మోహన్ రెడ్డి, బద్రి ఎర్రన్న, ఎంపీడీవో మధుసూదనరెడ్డి, తహాశీల్దార్ రవీంద్ర ప్రసాద్, తోపాటు ఆయా శాఖల అధికారులు, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.