Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: పండుగ వాతావరణంలో 'గడప గడప'కు

Gangula: పండుగ వాతావరణంలో ‘గడప గడప’కు

నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణంలో ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్ర రెడ్డి చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పండుగ వాతావరణం లో కొనసాగుతున్నది. వీధి వీధినా అడుగడుగునా వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఉత్సాహంగా ముందుకు వచ్చి ఎమ్మెల్యేకు నీరాజనం పలుకుతున్నారు. చాగలమర్రిలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల నాని చేరుకోగానే పాత బస్టాండు వద్ద మండల వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు వలిసా షరీఫ్ ఆధ్వర్యంలో క్రేన్ సహాయంతో భారీ గజమాల వేసి, గులాబీ రేకుల పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

అడ్డవాగు వద్ద వార్డు సభ్యుడు ముల్లా బురాంధిన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు , ప్రజలు గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు. పాత బస్టాండు, కోట గడ్డ , మోమిన్ విధి తదితర వీధుల్లో ఎమ్మెల్యే గంగుల నాని ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు ఇంటి స్థలాలు రాలేదని కొందరు ప్రజలు ఫిర్యాదు చేయగా తప్పనిసరిగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరికొందరు పింఛన్ల రాలేదని ఫిర్యాదు చేయగా తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్ , మండల అధ్యక్షుడు వీరభద్రుడు, ఉప సర్పంచ్ షేక్ సోహెల్ , ఉపమండల అధ్యక్షుడు ముల్లా రఫీ, మండల కో ఆప్షన్ సభ్యుడు జిగ్గి గారి ఇబ్రహీం , మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జాబీర్ , ఎంపీటీసీ సభ్యులు ఫయాజ్, లక్ష్మీరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు దస్తగిరి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు గణేష్ రెడ్డి , శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ అధ్యక్షుడు కొండయ్య , పాత శివాలయం కమిటీ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి , కమిటీ సభ్యుడు శ్రీనివాసులు , ఎంపీడీవో మహమ్మద్ దౌల , ఏఈలు కొండారెడ్డి, ముల్లా షాజహాన్ , షఫీ ఉల్లా ,రామక్రిష్ణ మెడికల్ స్టోర్ అధినేత వైఎస్సార్సిపి యువ నాయకుడు తొమండ్రు నాగేంద్ర , ఐడియా బాబు , గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు అలాంస గారి అబ్దుల్ , వెంకటరమణ, ఖాజామోహిద్దీన్, గేట్ల మహబూబ్ సాబ్ , ముల్లా ఖాదర్ బాష , చక్రం బీడీ ముల్లా షబ్బీర్, పెయింటర్ షరీఫ్, సీడ్ షేక్షా, పెయింటర్ గౌస్ పీర్ , బచ్చు సుబ్రహ్మణ్యం , పెద్ద రాముడు, స్వామి రెడ్డి, మాబు సున్నా, అబ్దుల్లా, బబ్లు , వలిసా గారి రఫీ, మండల ప్రచార కార్యదర్శి పెయింటర్ రఫీ , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News