గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శిరివెళ్ల మండలం, గోవిందపల్లె సచివాలయం 2 పరిధిలోని గోవిందపల్లె గ్రామంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి ప్రభుత్వం అందించే పథకాలను గూర్చి తెలిపారు. ఎవరికైనా అర్హులై ఉండి సంక్షేమ పథకాలు రాకుంటే వాలంటరీ లేదా సచివాలయం ద్వారా ప్రభుత్వ పథకం లబ్దిపొందచ్చని ఎమ్మెల్యే గంగుల తెలిపారు. ప్రజా సంక్షేమం కోసమే అహర్నిశలు ముఖ్యమంత్రి కష్టపడుతున్నారని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలం అందేలా చూస్తున్నారన్నారు. మహిళలకు పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ ప్రజల కోసం పని చేస్తున్నామని ఆయన అన్నారు. దేశంలోనే ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని, ప్రజల వద్దకే పాలన తెచ్చారని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అన్ని ప్రభుత్వమే చేస్తుందని మరలా వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే గంగులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం వైకాపా నాయకులు ఇందూరు ప్రతాపరెడ్డి, సిరివెళ్ల సలాం, శివారెడ్డి, అన్ని శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు.
