ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ప్రారంభించారు. ఆర్. కృష్ణాపురం, బాచేపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ప్రారంభించారు. ఆయా గ్రామాలలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, సిసి రోడ్లను ఎమ్మెల్యే గంగుల నాని, ఆళ్లగడ్డ ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగులకు గ్రామస్తులు వైసీపీ నాయకులు ఘన స్వాగతం అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాలలో కూడా గత ఐదు సంవత్సరాలుగా తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేశామన్నారు. ప్రజలు మరోమారు జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటే రాష్ట్రంలోని చిన్న చిన్న కుగ్రామాలు సైతం అభివృద్ధి పథంలో నడుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ మండల పరిషత్ వైసిపి నాయకులు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.