Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: చంద్రబాబు వాగ్దానాలు నమ్మేవారెవరు?

Gangula: చంద్రబాబు వాగ్దానాలు నమ్మేవారెవరు?

. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చక్కగా అమలు చేస్తున్నారు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే అపద్ధపు వాగ్దానాలను రాష్ట్ర ప్రజలు నమ్మరని మాజీ శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. చాగలమర్రి మండలం తోడనపల్లె గ్రామంలో మండలాధ్యక్షుడు రామిశెట్టి వీరభద్రుడు స్వగృహంలో జరిగిన ఒక శుభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు గంగుల. గ్రామానికి చేరుకోగానే మండల అధ్యక్షుడు వీరభద్రుడు ఆధ్వర్యంలో ఆయన కుటుంబ సభ్యులు వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భముగా మాజీ ఎమ్మెల్సీ గంగుల విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఎంతవరకు ఆ హామీలను అమలు చేశారని ప్రశ్నించారు. బ్యాంకులో తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయాడని ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు ఆ హామీని అమలు చేయకుండా నిరుద్యోగులను దగా చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చక్కగా అమలు చేసి ప్రజల ప్రశంసలు పొందుతున్నారని అయన ప్రశంసించారు. ప్రజలకు నచ్చిన విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పాలనా అందిస్తున్నదని ఇవ్వని హామీలను కూడా ముఖ్యమంత్రి అమలు చేసి ప్రజల కష్టాలను దూరం చేస్తున్నారని ఆయన తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వీరభద్రుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్, గంగుల రామిరెడ్డి ఎంపీపీలు గజ్జల రాఘవేంద్రారెడ్డి అమర్నాథ్ రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి ఆళ్లగడ్డ మున్సిపల్ కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి మండల పార్టీ కన్వీనర్ కుమార్ రెడ్డి చాగలమరి మేజర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ సోహెల్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు గణేష్ రెడ్డి, సర్పంచులు గోవిందయ్య,బంగారుషరీఫ్,ప్రతాపరెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు దస్తగిరి డైరెక్టర్ శ్రీనివాసులు మండల కో ఆప్షన్ సభ్యుడు జిగ్గి గారి ఇబ్రహీం ఎంపీటీసీ సభ్యులు వెంకట్ రాముడు,ఫయాజ్,లక్ష్మిరెడ్డి మాజీ జడ్పిటిసి రామ్ గురువిరెడ్డి తోపాటు పలు గ్రామాలకు చెందిన వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News