ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగు వచ్చిందని ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి తెలిపారు. చాగలమర్రిలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న ఎస్టీ కాలనీ, చాగలమ్మ చెంచు కాలనీ, కోటగడ్డ వీధుల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఆయన పెద్ద ఎత్తున నిర్వహించారు. ఎమ్మెల్యేకు వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా పేలుస్తూ గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. ఒక పండుగ లాగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చాగలమర్రిలో కొనసాగుతున్నది. ఎమ్మెల్యే నాని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందాయి, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నది అన్నారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి చెత్తబుట్టలో వేసిందని విమర్శించారు . తమ ప్రభుత్వం వర్గాలకు పార్టీలకు కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిందని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్, పార్టీ మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, చాగలమర్రి ఉపసర్పంచ్ సోహెల్, మండల ఉపాధ్యక్షుడు ముల్లా రఫీ, మండల కో ఆప్షన్ సభ్యుడు జిగ్గీ గారి ఇబ్రహీం, ఎంపిటిసి సభ్యులు. ఫయాజ్, లక్ష్మిరెడ్డి , సింగిల్ విండో అధ్యక్షుడు దస్తగిరి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు గణేష్ రెడ్డి, ఎంపీడీవో మహమ్మద్ దౌల, ఎంఈఓ అనురాధ., ఏఈలు ముల్లా షాజహాన్, కొండారెడ్డి, షఫీవుల్లా, ఏవో రంగ నేతాజీ, చాగలమర్రి ఈవో సుదర్శన్ రావు, ఐసిడిఎస్ సూపర్వైజర్ సుశీలమ్మ, వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు గేట్ల మహబూబ్ సాబ్ , ముల్లా ఖాదరబాష , చక్రం బీడీ షబ్బీర్, దాదా బిడి ఖాజా, బబ్లు, రాము, నర్సిరెడ్డి, ఐడియా బాబు, వెంకటరమణ, మాబుసున్న , అబ్దుల్లా, ఒలిసా గారి షరీఫ్, లడ్డు భాష, మదార్ వలి, మనోహర్ రెడ్డి, మండల ప్రచార కార్యదర్శి పెయింటర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.