Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: అభివృద్ధి, సంక్షేమానికి నిదర్శనం మా సర్కార్

Gangula: అభివృద్ధి, సంక్షేమానికి నిదర్శనం మా సర్కార్

అభివృద్ధి చేస్తే ప్రజలు ఎన్నటికి మరువరు

రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యం అయిందని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ రాష్ట్ర సలహా మండలి సభ్యులు మాజీ ప్రభుత్వ విప్ , శాసనమండలి మాజీ సభ్యులు, గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. స్థానిక డాక్టర్ సురేష్ రెడ్డి కళ్యాణ్ మండపంలో ముల్లా రఫీ కుమారుని ఆఖిక శుభకార్యానికి రాష్ట్ర జలవనరుల శాఖ సలహా మండలి సభ్యులు, గంగుల ప్రభాకర్ రెడ్డి ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం తో పాటు ఆళ్లగడ్డ నియోజకవర్గం లో బడుగు బలహీన వర్గాలు, కుల మతాలకతీతంగా, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయంటే కేవలం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సారధి అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే ఈ అవకాశం దక్కుతుందన్నారు.

- Advertisement -

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రతి గ్రామీణ ప్రాంతానికి తారు రోడ్ల సౌకర్యం, గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణం, మారుమూల ప్రాంతమైన చెంచుగూడెంకు నాలుగు కోట్లతో వంతెన నిర్మాణంతో పాటు చాగలమర్రి నుండి మహాదేవపురం వరకు రెండు లైన్ల రోడ్డు విస్తరణ, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి గ్రామ సచివాలయాలు , నాడు నేడు కింద అత్యధిక వసతులతో స్కూల్ భవన నిర్మాణాలు, విద్యార్థులకు మౌలిక వసతుల్లో భాగంగా స్కూల్ డ్రెస్సులు బూట్లు చెప్పులతో సహా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా చదువులు చెప్పించడమే కాకుండా తరగతి గదులలో మోడరన్ టెక్నాలజీతో చదువులని చెప్పించడం జరుగుతుంది అన్నారు. ఇంత అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షము విమర్శిస్తుందన్నారు. వారి విమర్శలను ప్రజలు తిప్పి కొట్టడం జరిగిందన్నారు. ఓటమిని నైతికంగా ఒప్పుకుంటే రాజకీయానికి హుందాతనం అవుతుందన్నారు. గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల మనకున్న నీటి వనరులు తక్కువ స్టోరేజీ ఉండడం వల్ల రైతులు గమనించి ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలన్నారు. తాను పోతిరెడ్డిపాడు వద్ద నీటిని విడుదల చేసేటప్పుడు ఆనాడే చెప్పడం జరిగిందన్నారు. ప్రస్తుతము నీటి సామర్థ్యం 854 అడుగుల్లో చేరుకుందని ఉన్న నీటిని కరెంటు ఉత్పత్తి కోసం తాగునీటి కోసం వాడుకోవడం జరుగుతుందన్నారు. చెరువులలో నీటిని నిలువ చేసేందుకు తక్కువ విడుదల చేయడం జరిగిందని, ఆ నీరు పశువులు తాగిందుకే విడుదలు చేశామన్నారు రైతులు నీటి ఆధారిత పంటలను సాగు చేయకుండా, వర్షాధార పంటలను సాగు చేయాలని సూచించారు. జగనన్న కాలనీలు పూర్తయితే మౌలిక వసతులన్నీ ప్రభుత్వమే కల్పిస్తుందని ఎమ్మెల్యే గంగుల నాని అన్నారు. జగనన్న కాలనీలో ఉండే గృహాలకు లబ్ధిదారులు 500 రూపాయలు చెల్లించి విద్యుత్ మీటర్లను తీసుకోవాలన్నారు. తాము సంక్షేమ పథకాలను, గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా సచివాలయం కు 20 లక్షల రూపాయల నిధులను కేటాయించి వాటితో అత్యవసర పనుల కోసం కేటాయించడం జరిగిందని, నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి జగనన్నతోనే సాధ్యమైంది ఆయన తెలిపారు. స్థానిక సంస్థల్లో ఒక్క వార్డు సభ్యులు కూడా గెలుచుకోలేకపోయారని, పైగా విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అన్నారు. పోటీకి ముందరే ఈ ఎన్నికలు 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు మూలం అని ప్రకటించిన వారు నేడు జరిగిన ఓటమిని అంగీకరించకుండా హాస్యాస్పదంగా మాట్లాడడం ఎంతవరకు సబబున్నారు.

అభివృద్ధి చేస్తే ప్రజలు ఎన్నటికి మరువరని ఆయన అన్నారు. ప్రజలకు, పాలకులు జవాబుదారితనంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గంలో మండలాల కేంద్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను కోరత లేకుండా నేడు ఆళ్లగడ్డ లో జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ అధికారులు, జిల్లా ఇన్చార్జి మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఇతర శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్, మండల అధ్యక్షుడు వీరభద్రుడు, ఉప మండల అధ్యక్షులు ముల్లా మహమ్మద్ రఫీ, మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ షేక్ మహమ్మద్ సుహేల్, ఎంపీటీసీ ఫయాజ్, పెద్ద వంగలి సర్పంచ్ బంగారు షరీఫ్, తోడేళ్లపల్లె సర్పంచ్ గోవిందయ్య, వైఎస్ఆర్సిపి నాయకులు, ఖాదర్ బాషా, భారత్ గ్యాస్ ప్రొప్రైటర్ రఫీ, ప్రభుత్వ ఖాజీ యూనస్, వార్డు సభ్యులు బురాందిన్, బీసీ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మండల ప్రచార కార్యదర్శి పెయింటర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News