Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్TDP-YSRCP: వైసీపీలోకి గంటా?.. బెదిరింపులా?.. బుజ్జగింపులా?

TDP-YSRCP: వైసీపీలోకి గంటా?.. బెదిరింపులా?.. బుజ్జగింపులా?

TDP-YSRCP: ఏపీలో వైసీపీ హవా తగ్గింది. ఎవరు అవును అన్నా.. కాదు అన్నా ఇది నిజం. గత ఎన్నికలలో కనిపించిన జోష్ ఇప్పుడు లేదు. ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత పార్టీపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఏ స్థాయిలో అన్నది ఇప్పుడే చెప్పలేం కానీ.. ప్రజా వ్యతిరేకత పార్టీలో నేతలకు తెలుసు. కానీ.. అధికారం ఉంది కనుక ఇప్పుడే జంపింగులు కనిపించవు. ఒక్కసారి ఎన్నికల వేడి మొదలైతే పార్టీని వీడేది ఎవరో.. పార్టీలో ఉండేదెవరో తెలుస్తుంది. అధికార పార్టీకి ప్రజలలో అసంతృప్తి మొదలైందని తెలిసినా ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.

- Advertisement -

ఔను.. ఉత్తరాంధ్ర సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గంటా పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తుండగా.. డిసెంబరు 1 ఆయన పుట్టిన రోజున లేదా తర్వాత రోజుల గంటా నుండి ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను స్పీకర్ ఇంకా ఆమోదించలేదు.

కాగా.. గంటా చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండగా.. అయన జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ.. అనూహ్యంగా వైసీపీకి వెళ్లే ఆలోచన బయటకి వచ్చింది. దీంతో ఇది బెదిరింపుల వలన చేస్తున్నారా? లేక ఎవరైనా బుజ్జగించారా అన్నది ఆసక్తి కరంగా మారింది. స్టీల్ ప్లాన్ ప్రయివేటీకరణ అంశంలో అటు బీజేపీతో పాటు వైసీపీ కూడా ప్రజల నుండి విమర్శలు ఎదుర్కొంటుంది. అలాంటి స్టీల్ ప్లాంట్ అంశంలో రాజీనామా చేసిన గంటా.. మళ్ళీ వైసీపీలోకి ఎలా చేరారన్నది రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

మరోవైపు జిల్లాలో వ్యాపార లావాదేవీల కోసమే ఆయన పార్టీ మారుతున్నారని.. ఆయనతో పాటు అనుచరుల వ్యాపారాలపై వైసీపీ ఫోకస్ చేయడంతో.. వారి కోసమే గంటా వైసీపీ వైపు వెళ్తున్నారని ప్రచారం కూడా ఉంది. నిజానికి పార్టీలు మారడం గంటాకు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు టీడీపీ నుండి ప్రజారాజ్యం పార్టీ, అక్కడ నుండి కాంగ్రెస్.. మళ్ళీ కాంగ్రెస్ నుండి టీడీపీ.. ఇందులో విశాఖ నార్త్, అనకాపల్లి, చోడవరం, భీమిలీ అలా నియోజకవర్గాలు స్థానభ్రంశం అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇలా వైసీపీ ఆలోచన చేస్తున్నారట. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News