ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ(AP Assembly) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలిరోజు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 27న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ చేపట్టనున్నారు. ఇక ఫిబ్రవరి 28న 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
- Advertisement -
15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. బీఏసీ సమావేశం తర్వాత సభ ఎన్ని రోజులు జరిగే దానిపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభకు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరుకావాలని మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.