Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: చంద్రబాబుతో కలిసి లండన్‌కు భువనేశ్వరి: ప్రతిష్ఠాత్మక 'ఐఓడీ ఫెలోషిప్' అందుకోనున్న ఏపీ సీఎం...

CM Chandrababu: చంద్రబాబుతో కలిసి లండన్‌కు భువనేశ్వరి: ప్రతిష్ఠాత్మక ‘ఐఓడీ ఫెలోషిప్’ అందుకోనున్న ఏపీ సీఎం సతీమణి!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా లండన్‌లోని తెలుగు కుటుంబాలు ముఖ్యమంత్రి దంపతులకు ఘనస్వాగతం పలికాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, అలాగే హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న నారా భువనేశ్వరికి లండన్‌కు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్’ (ఐఓడీ) సంస్థ అరుదైన గౌరవాన్ని ప్రకటించింది.

- Advertisement -

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆమె చేస్తున్న ప్రజాసేవ, సామాజిక సాధికారతకు గుర్తింపుగా నవంబర్ 4న ఈ విశిష్ట డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌ అవార్డును ప్రదానం చేయనున్నారు. అదే వేదికపై, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలో, ‘ఎక్స్‌లెన్స్ ఇన్‌ కార్పొరేట్ గవర్నెన్స్‌’ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు దక్కిన గోల్డెన్‌ పీకాక్‌ అవార్డును కూడా ఆమె అందుకోనున్నారు.

అబ్దుల్ కలాం అందుకున్న వేదికపై…
ఐఓడీ ఇచ్చే ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని గతంలో భారత మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్‌ కలాం, హిందూజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ వంటి దిగ్గజాలు అందుకున్నారు. అటువంటి గౌరవనీయమైన వేదికపై భువనేశ్వరి అవార్డు అందుకోనుండడం తెలుగువారందరికీ గర్వకారణం.వ్యక్తిగత పర్యటన ముగిసిన తర్వాత, సీఎం చంద్రబాబు లండన్‌ పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో భేటీ అవుతారు. త్వరలో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తారు. ముఖ్యమంత్రి నవంబర్ 6న తిరిగి అమరావతికి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad