ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల వరద వస్తోందని సగర్వంగా ట్వీట్ చేశారు సీఎం జగన్. 340 సంస్థలు, 13 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు వచ్చినట్టు ఆయన తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ తొలిరోజే 92 ఎంఓయులూ రాగా మొత్తం 340 ఎంవోయూల ద్వారా 6 లక్షల మందికి ఏపీలో ఉపాధి దొరకనుందన్నారు. ఏపీలో 20 రంగాల్లో పెట్టుబడుల వరద ప్రవాహం కొనసాగిందన్న జగన్, పలు రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినట్టు వివరించారు.
- Advertisement -
మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ జగన్ తన ప్రసంగంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ సమావేశాలకు హాజరయ్యారు.