కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప(YSR Kadapa) జిల్లాగా పేరు మారుస్తూ జీవో జారీ చేసింది. ఈమేరకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కడప జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్పు చేసిన సంగతి తెలిసిందే. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కడప పేరును తొలగించి వైఎస్సార్ జిల్లాగా మార్చింది. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఈ క్రమంలో జిల్లాలో ప్రతిపక్ష నేత హోదాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు పేరు మార్పుపై హామీ ఇచ్చారు. తాజాగా ఈ హామీని నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు.