Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Godavari floods: మరో 2 రోజులు పెరగనున్న గోదావరి ఉధృతి

Godavari floods: మరో 2 రోజులు పెరగనున్న గోదావరి ఉధృతి

రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద మరో రెండు రోజులు వరకు పెరుగున్నట్లు విపత్తుల సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. గురువారం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కోనసాగుతుందని నీటిమట్టం 47.80 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.05 లక్షల క్యూసెక్కులు ఉందని రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు.

- Advertisement -

రెండవ ప్రమాద హెచ్చరిక వలన ప్రభావితమయ్యే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 42 మండలాల్లో 458 గ్రామాల వరకు క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.

విపత్తుల సంస్థ ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామన్నారు. అత్యవసర సహాయక చర్యలకోసం 3NDRF, 4 SDRF మొత్తం 7 బృందాలు ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి తెలిపారు. ప్రజల ఫోన్లకు హెచ్చరిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సందేశాలు పంపుతున్నామన్నారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరో వైపు ప్రకాశం బ్యారేజి వద్ద 1.42 లక్షల ఔట్ ఫ్లో ఉందని కృష్ణా లొతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 1800 425 0101 సంప్రదించాలన్నారు.

గోదావరికి కొనసాగుతున్న వరద ఉధృతి

ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.05 లక్షల క్యూసెక్కులు

రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

నిరంతరం స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి వరద ఉధృతి పర్యవేక్షణ

ప్రభావిత 6జిల్లాల్లోని 42 మండలాలు 458 గ్రామాలు అప్రమత్తం

సహాయచర్యల్లో 3NDRF, 4SDRF బృందాలు

క్షేత్రస్థాయిలో ప్రజలకు హెచ్చరిక సందేశాలు

గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

  • డా. బి.ఆర్ అంబేద్కర్,మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News