Friday, October 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Gonegandla: గ్రామాల్లో ప్రశాంతంగా ఉండాలంటూ డీఎస్పీ హితవు

Gonegandla: గ్రామాల్లో ప్రశాంతంగా ఉండాలంటూ డీఎస్పీ హితవు

ఫ్యాక్షన్ వద్దు, శాంతి ముద్దు

గోనెగండ్ల మండలం పరిధిలోని ఫ్యాక్షన్ గ్రామమైన కున్నూరు గ్రామాన్ని శుక్రవారం ఎమ్మిగనూరు డిఎస్పీ యం. ఉపేంద్ర బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడుతూ గ్రామంలో ఒకరికొకరు సహకరించుకుంటూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు.

- Advertisement -

చిన్నచిన్న మాటలకు, పొరపాట్లకు ఎటువంటి గొడవలు చేసుకోకుండా ఉండాలన్నారు. అనంతరం కొన్నూరు గ్రామంలో పికెట్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది తో మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ఉండాలని ఉండాలని సూచించారు. పికెట్ పాయింట్ బుక్కు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో గోనెగండ్ల సీఐ గంగాధర్, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News