Saturday, September 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Gonegandla: ఎన్ సి సి విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం

Gonegandla: ఎన్ సి సి విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం

మండల కేంద్రమైన గోనెగండ్ల లోని ఏపీ మోడల్ స్కూల్ నందు ఎన్ సిసి 9 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ జోబీ ఫిలిప్, గోనెగండ్ల లోని ఏపీ మోడల్ ప్రిన్సిపల్ షాహినా పర్వీన్ ల అధ్వర్యంలో గత సంవత్సరపు 8వ, 9వ తరగతి విద్యార్థినిలకు ఎన్ సి సి-ఎ సర్టిఫికేట్లను ప్రధానం చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ సీసీలో చేరడం వలన విద్యార్థినులకు క్రమశిక్షణ, ఐక్యత అలవడుతుందని, ఈ సర్టిఫికెట్ల ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎన్ సీసీ, సీటీవో ఉపాధ్యాయుని పద్మావతి , విద్యార్థులను అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News